లిక్కర్ స్కామ్ లో జగన్ ప్రమేయం
NEWS Jul 31,2025 07:34 am
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ జగన్ తప్పించు కోలేరన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టెక్నికల్ గా ఆధారాలు ఉన్నాయన్నారు. వెంకట్ రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్ గా నియమించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు లావాదేవీలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మిథున్ రెడ్డి దగ్గర రూ.5 కోట్లు, శంషాబాద్ లో రూ.11 కోట్లు దొరికాయన్నారు. ఇక రూ.3,700 కోట్ల నగదు తరలించాలంటే ఎన్ని ట్రక్కులు కావాలని పేర్కొన్నారు.