నా డ్రెస్సులు నా ఇష్టం - అనసూయ
NEWS Jul 30,2025 09:11 pm
యాంకర్ అనసూయ భరద్వాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. సుదీర్ఘ లేఖ రాశారు. నా డ్రెస్సులు నా ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇటీవల నా డ్రెస్సింగ్ పై ఇష్టానుసారంగా రాశారంటూ వాపోయారు. తన వ్యక్తిగత జీవితంతో వాళ్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. నచ్చిన దుస్తులు ధరించడం నా వ్యక్తిగతం అని పేర్కొన్నారు. నా అభిరుచికి తగ్గట్టు నేనుంటా. ఇద్దరు పిల్లలకు తల్లి అయినంత మాత్రాన నా ఇష్టాలను, వ్యక్తిత్వాన్ని వదులు కోవాలా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.