రేవంత్ రెడ్డితో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
NEWS Jul 31,2025 01:27 am
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్‌లపై ఢిల్లీలో పోరాడేందుకు కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది.