ఎన్సిసి క్యాడేట్స్ కు డ్రోన్ వినియోగంపై శిక్షణ
NEWS Jul 30,2025 10:58 pm
ఎన్సిసి వరంగల్ ఆధ్వర్యంలో ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ కాకతీయ యూనివర్సిటీ మైదానంలో ఎన్సిసి క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో భాగంగా ఎన్సిసి క్యాడేట్స్ కి డ్రోన్ వినియోగంలో శిక్షణ,రక్షణ రంగంలో వాటి ఉపయోగాలు సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఎంపికైన వారిని ఆల్ ఇండియా వాయుసేన లాంటి జాతీయ క్యాంపులలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కమాండింగ్ ఆఫీసర్ ఆశిష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.