స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్
NEWS Jul 30,2025 03:05 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా స్థానికులకే టికెట్ దక్కనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని వివిధ హోదాల్లో కష్టపడుతున్న వారికి అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. అభ్యర్థిగా ఎవరున్నా అందరు కలిసి పనిచేస్తారని తెలిపారు. అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతుందని, అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి అజారుద్దీన్, నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ పాల్గొన్నారు.