సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఐవిపి సెమీ కండక్టర్స్ ఫౌండర్ రాజా మాణిక్కంతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి చేసిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు రాజా మాణిక్కం.