కింగ్‌డమ్ రిలీజ్‌కు ముందు విజయ్ దేవరకొండ భావోద్వేగ పోస్టు
NEWS Jul 30,2025 02:23 pm
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ నేపథ్యంలో విజయ్ తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అభిమానులను ఉద్దేశించి ఒక భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు.సూరి (కింగ్‌డమ్‌లో విజయ్ పాత్ర పేరు) నిండా ఆగ్రహంతో ఉన్నాడు. కానీ, అభిమానుల ప్రేమ వల్ల నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను.