ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను
NEWS Jul 30,2025 02:14 pm
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీకి మాత్రమే రాజీనామా చేశానని, ఒకవేళ పిలిస్తే ఆలోచిస్తానని అన్నారు. కానీ తన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. ఇంకో మూడు సంవత్సరాల పాటు తాను కొనసాగుతానని చెప్పారు. తన పరంగా కూడా కొన్ని తప్పులు జరిగాయని అన్నారు. తాను లీక్ చేస్తున్నానంటూ మా పార్టీకి చెందిన వాళ్లే అధిష్టానానికి ఫిర్యాదు చేశారని వాపోయారు. అందుకే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. తనకు శత్రువులు బయట లేరని పార్టీలోనే ఉన్నారన్నారు.