సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు సీఎం చంద్రబాబు వరుస భేటీలు
NEWS Jul 30,2025 01:24 pm
సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా ఉంది. ఇవాళ నాలుగో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు.