SC గురుకులాల్లో స్పాట్ ఆడ్మిషన్స్
NEWS Jul 30,2025 02:55 pm
జగిత్యాల జిల్లాలోని సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకై రేపు స్పాట్ ఆడ్మిషన్స్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు జగిత్యాల జిల్లా సమన్వయాధికారి గుండోజి లక్ష్మీ నారాయణ తెలిపారు. జిల్లాలోని మేడిపల్లి(బాలుర) లో, కోరుట్ల(బాలుర)లో, మెట్పల్లి(బాలికలు)లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం ఆయా కళాశాలల్లో సంప్రదించాలన్నారు.