శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
NEWS Jul 30,2025 10:03 am
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎనిమిది రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,66,325 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,82,478 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీల వద్ద నీరు నిలిచి ఉంది. భారీగా నీరు ఉండడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.