తిరుమల భక్తులతో కిటకిట
NEWS Jul 30,2025 09:40 am
తిరుమల క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 75 వేల 183 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 906 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.89 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో . ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.