రేపటి నుంచి పాదయాత్రలు - టీపీసీసీ
NEWS Jul 30,2025 07:53 am
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిగి నుంచి వరంగల్ వర్థన్నపేట వరకూ పాదయాత్రలు ఉంటాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లకు ప్రయారిటీ ఇస్తామన్నారు.