బాబు కామెంట్స్ కర్ణాటక మంత్రి కౌంటర్
NEWS Jul 30,2025 07:44 am
సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కర్ణాటక మంత్రి ఎన్ఎస్ బోసు రాజు. ఇండియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ ను అమరావతిలో నిర్మిస్తున్నామని బాబు చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియాలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్ బెంగుళూరులో నిర్మించామని, ఏప్రిల్ - 2025 నుండి ఆ కంప్యూటర్ సేవలు వినియోగిస్తు న్నామని తెలిపారు. అబద్దాలు చెప్పడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు.