ట్రంప్ కు మోదీ సరెండర్ అయ్యారు
NEWS Jul 30,2025 07:36 am
ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చపై స్పందించారు. అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ బెదిరించడంతో ప్రధాని సరెండర్ అయ్యారంటూ మండిపడ్డారు. దేశం కోసం పోరాడే జవానులో పులిని చూస్తానని, అయితే పులికి పూర్తి స్వేచ్ఛ అవసరం అన్నారు. కానీ ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రభుత్వ పెద్దలు మన సైనికుల చేతులు కట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళాన్ని ఉపయోగించాలంటే నూటికి నూరు శాతం రాజకీయ సంకల్పం ఉండాలన్నారు.