సింగపూర్ దేశాధ్యక్షుడితో సీఎం భేటీ
NEWS Jul 30,2025 07:30 am
సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్. టూర్ లో భాగంగా దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నంతో భేటీ అయ్యారు. ఏపీకి వివిధ రంగాల్లో సింగపూర్ నుంచి సహకారంపై చర్చించారు. భేటీలో మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు ప్రెసిడెంట్ రత్నం.