రాహుల్ కామెంట్స్ మోదీ సీరియస్
NEWS Jul 30,2025 07:25 am
ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. లోక్ సభ సాక్షిగా ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. కాంగ్రెస్ హెడ్ లైన్స్ లో ఉండొచ్చు కానీ ప్రజల హృదయాల్లో మాత్రం లేదన్నారు. యుద్ధం ఆపాలని పాకిస్తాన్ అడుక్కుందని, అందుకే ఆపాల్సి వచ్చిందన్నారు. భారత్ దాడులతో కాళ్ల బేరానికి వచ్చిందని, మన DGMOకు ఫోన్ చేసి మాపై దాడులు చేయొద్దని, తట్టుకునే శక్తి లేదని ప్రాధేయ పడిందన్నారు.