స్థానిక పోరులో దశలపై ఆశావహుల్లో దడ
NEWS Jul 30,2025 10:26 am
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని PR శాఖ ఎన్నికల సంఘానికి తాజాగా ప్రతిపాదించింది. గతంలో 3 దశల్లో జరగగా, ఈసారి 2 దశల్లో నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు ఈసీకి ఆ శాఖ తెలిపింది. అయితే, ఇప్పటికే ఖర్చులు పెడుతున్న ఆశావహులు.. ఎంత త్వరగా ఎన్నికలు ముగిస్తే ఖర్చు అంత తగ్గుతుందని మదనపడుతూ దశలపై దడ మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.