ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ రిజ్వాన్ భాషాతో కలిసి ఎమ్మెల్యే పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను 3500 ఇండ్లు కేటాయించడం జరిగిందన్నారు.ఇప్పటివరకు మంజూరైన ఇండ్లన్నీ త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఆగస్టు 3వ తేదీలోగా గ్రామాల వారిగా క్షేత్రస్థాయి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.