రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి
NEWS Jul 30,2025 10:24 am
మల్యాల మండలంలోని డీసీఎంఎస్-2 ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా షాప్ లోని లైసెన్స్, బిల్లులను పరిశీలించి, అధిక ధరలకు విక్రయించినచో కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి డీలర్ ప్రదర్శన బోర్డు, స్టాక్ రిజిస్టర్, రైతు వారీగా అమ్మకపు పట్టికను ఏర్పాటు చేసి, నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు.