త్వరలో యాప్: తప్పు చేసినవారికి సినిమా చూపిస్తాం - జగన్
NEWS Jul 29,2025 12:14 pm
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలో పార్టీ తరఫున ఒక మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నామని, ప్రభుత్వ వేధింపులు లేదా అన్యాయాలకు గురైన వారు ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు.