నిఘా వైఫల్యం వల్లనే పహల్గాం దాడి
NEWS Jul 29,2025 04:51 pm
ఎంపీ ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. లోక్ సభలో మోదీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం దాడి ఘటనపై స్పందించారు. ఇది పూర్తిగా నిఘా వైఫల్యం వల్లనే జరిగిందని ఆరోపించారు. కాశ్మీర్ లో ఇప్పటికీ సాధారణ పరిస్థితిలు లేవన్నారు.