సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదని ప్రశ్నించారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు తేడా వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాయా లేదా అన్నది చెప్పాలన్నారు. కేటీఆర్ గుండెపై చేయివేసుకొని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.