కవితకు అంత సీన్ లేదన్న జగ్గన్న
NEWS Jul 29,2025 04:29 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎమ్మెల్సీ కవితపై సెటైర్స్ వేశారు. కవితనా ఆమె ఎవరంటూ ప్రశ్నించారు. ఆమెకు అంత సీన్ లేదన్నారు. తన తండ్రి కేసీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. వాళ్ల నాన్న దుకాణం బంద్ అయ్యిందని, ఇక తాను దుకాణం తెరిచిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదంటూ ప్రశ్నించారు.