శేఖర్ కు ఇందిరాశోభన్ పరామర్శ..
అండగా ఉంటామని ఫ్యామిలీకి భరోసా
NEWS Jul 29,2025 10:50 am
హైదరాబాద్: కిడ్నీ సమస్యతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన శేఖర్ ను కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్, రాష్ట్ర నాయకులు పోతుగంటి నరేందర్ పరామర్శించారు. అనంతరం వారు వైద్యులతో మాట్లాడి, శేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని శేఖర్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.