వైసీపీ తరపున త్వరలో యాప్
NEWS Jul 29,2025 03:59 pm
మాజీ సీఎం జగన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తరపున త్వరలో యాప్ ను తీసుకు రానున్నట్లు వెల్లడించారు. సర్కార్ వేధింపులకు పాల్పడినా లేదా అక్రమంగా కేసులు నమోదు చేసినా, చెప్పకుండా అరెస్ట్ చేసినా వెంటనే తెలియ చేసేందుకు గాను దీనిని తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే ఈ యాప్ లో నమోదు చేయాలని సూచించారు మాజీ సీఎం.