సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్: ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం; సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
NEWS Jul 29,2025 08:37 am
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా.. గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రి చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంపై 'ఎక్స్' (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు చేసిన ఆయన ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.