లగచర్ల రైతులకు కోర్టు ఊరట
NEWS Jul 29,2025 01:14 pm
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతులకు కోర్టు హాజరు నుండి ఊరట లభించింది. లగచర్ల ఫార్మా భూ సేకరణ విషయంలో అక్రమంగా అరెస్ట్ అయిన వారికి కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది నాంపల్లి ప్రత్యేక పీడీపీపీ కోర్టు. పొలాలకు వెళ్ళాల్సిన రైతులు కోర్టుకు రావాల్సి వస్తుందని, దినసరి పనుల నిమిత్తం హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని లాయర్ వాదనలతో ఏకీభవించారు. కోర్టు నుండి సమన్లు వచ్చిన తర్వాత రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.