క్యారియర్ సంస్థ ఏడీతో లోకేష్ భేటీ
NEWS Jul 29,2025 01:00 pm
సింగపూర్ లో క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అరుణ్ భాటియాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలోని అమరావతి, విశాఖపట్నం వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో క్యారియర్ HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్) వ్యవస్థలను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. ఈ సందర్బంగా మంత్రి చేసిన ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు ఏడీ.