పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ రచ్చ.. సహనం కోల్పోయిన అమిత్ షా
NEWS Jul 29,2025 12:49 pm
లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు. విపక్షాలు దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, విదేశీ వాదనలను నమ్ముతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను జైశంకర్ ఖండించారు.