ఆపరేషన్ సిందూర్ చర్చలోకి ‘మెక్ డొనాల్డ్స్’.. రెస్టారెంట్ ను మూసేయాలన్న ఎంపీ
NEWS Jul 29,2025 06:59 am
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరుగుతున్న చర్చలోకి కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా అమెరికాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ ‘మెక్ డొనాల్డ్స్’ ను లాగారు. అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బుద్ధి చెప్పాలంటే భారతదేశంలోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ చెయిన్ ను మూసేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణించాలన్న అమెరికా తీరుకు గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు.