భక్తిశ్రద్దలతో నాగుల పంచమి వేడుక
NEWS Jul 30,2025 10:24 am
మల్యాల మండలంలో నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని శివాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టల్లో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మవాడలోని పోచమ్మ దేవాలయంలో కొలువైన జంట నాగ దేవతలను మహిళలు, కొత్తగా పెళ్లయిన జంటలు ఎంతో భక్తి శ్రద్దలతో మొక్కులు తీర్చుకున్నారు.