నిరుద్యోగ మహిళలకు శుభవార్త
NEWS Jul 30,2025 10:25 am
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శుభవార్తను అందించింది.హసన్ పర్తిలో ఉన్న ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణను అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 18 నుంచి 45ఏళ్ల లోపు వయస్సు గల నిరుద్యోగ మహిళలు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఎంపికైన వారికి ఉచిత వసతి,భోజన సౌకర్యం ఉంటుందన్నారు. వివరాలకు 9704056522 నెంబర్ ను సంప్రదించాలన్నారు.