శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.44 కోట్లు
NEWS Jul 29,2025 10:07 am
తిరుమల శ్రీవారిని 77 వేల 44 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 478 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.44 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.