శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
NEWS Jul 29,2025 08:39 am
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఐదు రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,32,290 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,01,743 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 883.00 అడుగులకు చేరుకుంది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 204.7880 టీఎంసీలుగా ఉంది. నీళ్లు ఉండడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.