జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత
NEWS Jul 29,2025 08:35 am
భారీ వర్షాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ఇన్ ఫ్లో 1లక్ష 30 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1లక్ష 31వేల 840 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 317.710 మీటర్ల వద్ద ఉంది . నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.05 టీఎంసీలుగా ఉంది. నీరు సమృద్దిగా ఉండడంతో జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.