ప్రయాణీకులకు ఆర్టీసీ ఖుష్ కబర్
NEWS Jul 29,2025 08:20 am
తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ లో నిత్యం రాక పోకలు సాగించే ప్రయాణీకులకు తీపి కబురు చెప్పారు. ప్రయాణీకులకు టిఎట్ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాణీకుల కోసం 24 గంటల పాటు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.