గుడ్ టచ్ బ్యాచ్ కార్యక్రమం నిర్వహించిన ఎస్సై
NEWS Jul 29,2025 10:34 am
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు, సోమవారం కొండపి ఎస్సై బి. ప్రేమ్ కుమార్, వారి సిబ్బందితో కలసి కొండపి మండలం నేతి వారిపాలెం గ్రామం లో,ని హై స్కూల్ లో ఉన్న విద్యార్ధిని, విద్యార్థులకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద మరియు సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణగా మెలగాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. యువత చెడు వ్యసనాలకి బానిస కావద్దని తెలిపారు.