ఆవిష్కరణలకు హబ్ గా ఏపీ
NEWS Jul 28,2025 08:44 pm
కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ లకు ఏపీని కేరాఫ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి విద్యావేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొత్తగా ఆలోచనలతో వచ్చే వారికి తాము సహకరిస్తామని అన్నారు. అన్ని రంగాలలో ఏపీని టాప్ లో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేస్తున్నామని వివరించారు.