ఏపీ పోర్టులకు సింగపూర్ సాంకేతికత
NEWS Jul 28,2025 08:40 pm
ఏపీలోని ఓడరేవులకు సింగపూర్ నుంచి సాంకేతిక సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రతి 50 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఓ పోర్టు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోర్టుల నిర్మాణం మొదలుకుని ఆయా పోర్టుల్లో ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు పరిశీలించామన్నారు.