బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇవ్వడం పట్ల మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ పూర్తిగా బీసీలకు వ్యతిరేకం అని తేలి పోయిందన్నారు.