సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో సీఎం చంద్రబాబు
NEWS Jul 28,2025 07:45 pm
క్రీడలతోనూ పర్యాటక-వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యమని...అందుకే ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు అత్యధిక ప్రాధానత్య ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేయటంతో పాటు క్రీడా సదుపాయాలు, పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని అన్నారు. సోమవారం నాడు సింగపూర్ పర్యటనలో రెండో రోజున సీఎం చంద్రబాబు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ స్పోర్ట్స్ స్కూలును సందర్శించారు.