ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్నచిన్న విషయాలు పట్టించుకోకూడదు: రాజ్ నాథ్ సింగ్
NEWS Jul 28,2025 05:28 pm
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ ను కాళ్లబేరానికి తీసుకువచ్చిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మే 7న చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారత్ తిరుగులేని విజయం సాధించిందని, ఇంత భారీ ఆపరేషన్ చేపట్టినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని అన్నారు. భారత సైన్యం ఘనతలను విపక్షాలు తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు.