గడిచిన 13 నెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని వైసీపీ గిద్దలూరు ఇన్ఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి విమర్శించారు. సోమవారం అర్ధవీడు మండలంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకంలో దాదాపు 20 లక్షల మంది తల్లులకు డబ్బులు పడలేదని అన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్న సీఎం కావడం ఖాయమన్నారు.