విజయవాడ మెట్రోకు టెండర్లకు ఆహ్వానం
NEWS Jul 28,2025 04:25 pm
ఇక ఏపీలోనూ మెట్రో రైలు కూత వినిపించనుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ మెట్రోకు టెండర్లు పిలవగా... తాజాగా, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ మేరకు ఈపీసీ విధానంలో టెండర్లకు ఆహ్వానం పలికింది.