మోడల్ స్కూల్ రోడ్డు పనులు మొదలు పెట్టండి
NEWS Jul 30,2025 10:34 am
కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ వరకు మంజూరైన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీఓకు వినతిపత్రాన్ని అందించారు. మోడల్ స్కూల్,కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాలకు ఈదారిలో వెళ్లే విద్యార్థులకు వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, గాంధారి శ్రీను ధర్మపురి జలందర్, గడ్డం జీవన్ రెడ్డి, ప్రసాద్, కాసోజి ప్రతాప్ బీజేపీ నాయకులుపాల్గొన్నారు.