వినాయక చవితికి 'పెద్ది' నుంచి ఫస్ట్ సాంగ్..
NEWS Jul 28,2025 01:28 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో చెర్రీ ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. వినాయక చవితి సందర్భంగా వచ్చే నెల 25న ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.