ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రూ.2 లక్షల రుణం
NEWS Jul 28,2025 12:54 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం’ లబ్ధిదారులకు మరో శుభవార్త.. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలకు గూడు కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఈ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.