పాలన గాలికి.. ప్రగతి కాటికి.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం: కేటీఆర్
NEWS Jul 28,2025 11:41 am
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకుందని దుయ్యబట్టారు. నాడు ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు.