నాలుగో టెస్టు ఆఖర్లో ఆసక్తికర ఘటన.. ఇంగ్లండ్ కెప్టెన్‌కు జడ్డూ అదిరిపోయే సమాధానం
NEWS Jul 28,2025 10:22 am
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు వీరోచితంగా పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే, మ్యాచ్ ఆఖర్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఆ ప్రతిపాదనకు భారత ప్లేయర్లు నిరాకరించారు. దాంతో స్టోక్స్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. "బ్రూక్, డకెట్ బౌలింగ్‌లో సెంచరీ చేద్దామనుకుంటున్నావా" అంటూ స్టోక్స్.. జడేజాతో వెటకారంగా మాట్లాడాడు. అతనికి జడ్డూ తనదైనశైలిలో సమాధానం ఇచ్చాడు.